11-02-2026 12:46:51 AM
ధర్పల్లి, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : దర్పల్లి మండలంలోని హొన్నాజీపేట గ్రామంలో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ సంస్థల, ఆధ్వర్యంలో మైగ్రేషన్ మల్టీ పార్ట్నర్ ట్రస్ట్ ఫండ్ కార్యక్రమంలో భాగంగా వాసన్ ఎన్జీవో ఆర్గనైజేషన్ బాలసభను ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రోగ్రామ్ ఆఫీసర్ విజయ్ మాట్లాడుతూ వ్యవసాయం వాతావరణ మార్పులను వెనకటి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం దేసి ప్యాడి పశుపోషణ పై విద్యార్థులకు అవగాహన కల్పించడం, ప్రోత్సహించే విధంగా యాక్టివిటీస్ ఫీజ్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది.
ఎన్. డబ్ల్యూ. డబ్ల్యూ.టి. వెల్ఫేర్ ట్రస్ట్ ఫీల్ ఫెసిలిటీ వంశీ మాట్లాడుతూ సురక్షిత వలస సేఫ్ మైగ్రేషన్ ఉపాధి అవకాశాలు పై వివరణ తెలియజేశారు.ఈ కార్యక్రమాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18005991393 ద్వారా అవసరమైన సమాచారం సహాయక సేవలు పొందవచ్చని విద్యార్థులకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు. ఈ ప్రోగ్రాం లో పాల్గొన్నవారు అగ్రికల్చర్ ఏఈఓ ఎం శ్రీనివాస్, ఐకెపి సప్న, వివో ఏ, పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట్ రామయ్య, రాజ్ కుమార్,నాగేష్,సరిత,రాజమణి, వాసన్ డిస్టిక్ కోఆర్డినేటర్ విజయ, సి ఆర్ పి మనోహర్ అండ్ సంతోష్ ఎన్. డబ్ల్యూ. డబ్ల్యూ. టి వంశీ సురేష్ అండ్ ఫార్మర్ సంతోష్ రెడ్డి పాల్గొన్నారు.