12 May, 2026 | 3:18 PM

బీసీ గురుకులాల్లో సీఈసీ గ్రూపు పునరుద్ధరణకు ఆర్.కృష్ణయ్యకు పాలాభిషేకం

12-05-2026 02:13 PM

దేవరకొండ,(విజయక్రాంతి): బీసీ గురుకులాల్లో తొలగించిన సీఈసీ గ్రూపులను తిరిగి యథాస్థానంలో కొనసాగించేలా చర్యలు తీసుకున్న రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య కు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దేవరకొండలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, పేద మరియు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ఆర్. కృష్ణయ్య చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని బీసీ గురుకులాల్లో తొలగించిన గ్రూపులను పునరుద్ధరించడం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రెడ్డి కోటేశ్వరరావు, పున్న వెంకటేష్, చేరుపెల్లి జయలక్ష్మి, ఎండి రంజాన్ బేగ్, చిలువేరు ముత్తమ్మ, బీమగోని శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.