12 May, 2026 | 3:31 PM

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో చేర్పించాలి

12-05-2026 02:10 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రగతి ప్రణాళిక ప్రజా పాలనా విద్యా వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న ఆచార్య జయశంకర్ బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ పీఎంఆర్సీ, ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్ లోని బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు, బడి బయట ఉన్న వారిని ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పవార్ లింబారావ్, ఎస్సీఆర్‌పీలు రాథోడ్ రవీందర్, కూడ్మేత అనంత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.