8 July, 2026 | 5:04 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

మంత్రి, ఎంపీ ఫొటోలు మార్ఫింగ్

16-10-2024 01:09 AM

ఇద్దరి అరెస్ట్ 

హైదరాబాద్‌సిటీబ్యూరో, అక్టోబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ఫొటోల మార్ఫింగ్ కేసులో మంగళవారం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. దుబ్బాకలో జరిగిన షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు హాజరయ్యారు.

వీరి ఫొటోలను జగిత్యాల జిల్లా రాయికల్‌కు చెందిన అనుమళ్ల మహేశ్, నిజామాబాద్ జిల్లా కోనాపూర్‌కు చెందిన దేవన్న అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఎంపీ రఘునందన్‌రావు దుబ్బాక పోలీస్‌స్టేషన్‌తో పాటు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో నిందితుల కోసం గాలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు