24 July, 2026 | 5:16 PM

ఎస్‌ఐఆర్ ప్రక్రియపై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష

24-07-2026 04:39 PM

ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియపై బూత్ లెవల్ అధికారులతో (BLO) నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి కోమటిరెడ్డి దిశానిర్దేశం చేశారు. జాబితాలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలన జరపాలని, ముఖ్యంగా కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ఈ బాధ్యతను అధికారులు సమర్థవంతంగా నిర్వర్తించాలని మంత్రి పేర్కొన్నారు.