24 August, 2026 | 11:45 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం బహిరంగ లేఖ

21-04-2026 10:31 AM

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి(AP CM Chandrababu) చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదని హితవు పలికారు. బీజేపీ, టీడీపీ, జనసేన అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవని మంత్రి పొన్నం సూచించారు. రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు ద్వేషాలు రగిలించేలా ఉన్నాయన్నారు. అసందర్భ వ్యాఖ్యలు తెలుగువారి మధ్య వైషమ్యాలు రగిలించేలా ఉన్నాయని పేర్కొన్నారు.

మీరు చొరవ తీసుకుని బీజేపీ, జనసేన నేతలకు సర్దిచెప్పాలని తెలిపారు. మరే ఎంపీ రాష్ట్ర విభజనపై(State Division) అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలన్నారు. విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(BJP MP Tejasvi Surya) వ్యాఖ్యల విషయమై స్పీకర్ కు లేఖ రాయాలని పొన్నం తెలిపారు. తేజస్వి వ్యాఖ్యలను లోక్ సభ రికార్డుల నుంచి తొలగించేలా స్పీకర్  ఓం బిర్లాకు లేఖ రావాలని వెల్లడించారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో సాగడం తక్షణ అవసరమని తెలిపారు. తన వినతిని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.