1 April, 2026 | 2:55 AM

రంజాన్ మాసంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

18-02-2025 05:19 PM

హైదరాబాద్: రంజాన్ మాసం(Ramadan Arrangements) ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) మంగళవారం సమీక్ష నిర్వహించారు. మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసానికి ఏర్పాట్లు  చేయాలని అధికారులును మంత్రి పొన్నం ఆదేశించారు. మసీదులు, ఈద్గాల వద్ద పారిశుద్ధ్యం, వీధిదీపాలు, నీటి వసతి ఏర్పాటు చేయాలని సూచించారు. రంజాన్ మాసం(Ramadan month)లో ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించాలని తెలిపారు.

సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ జారీ చేసింది. మార్చి 2 నుంచి 31 వరకు ముస్లిం ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government ) వెసులుబాటు కల్పించింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయని మంత్రి ఆదేశించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలన్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దని ఆయన అధికారులను ఆదేశించారు.

భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ముస్లిం ఉద్యోగులను సాయంత్రం 4 గంటలకు త్వరగా కార్యాలయాలు వదిలి వెళ్ళడానికి అనుమతించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రత్యేక ప్రార్థనల కోసం ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రజలను త్వరగా వెళ్లనివ్వడంపై రాజా సింగ్ మండిపడ్డారు.