1 April, 2026 | 1:07 AM

హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు

18-02-2025 04:50 PM

హైదరాబాద్: నల్లగొండ జిల్లాలో హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. నల్గొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు(Nalgonda District SC and ST Court) 17 మందికి జీవిత ఖైదు విధించింది. అడ్డగూడూరు మండలం(Addagudur Mandal) ఆజిమ్ పేటలో దుండగులు లింగయ్యను హత్య చేశారు. హత్య కేసులో అప్పటి సర్పంచ్ తో సహా 18 మంది నిందితులు పేర్లను ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు. కోర్టు వాయిదాలు(Court adjournments) నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. తుది తీర్పులో భాగంగా 17 మందిని దోషులుగా తేలుస్తూ కోర్టు శిక్ష ఖరారు చేసింది. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.