21 May, 2026 | 12:30 AM

మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు

18-03-2026 10:55 AM

హైదరాబాద్: మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు(Telangana Assembly Session) ప్రారంభమై కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) శాసనమండలిలో వెల్లడించారు. మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. 600 బస్సులకు మహిళలను యజమానులను చేశామని వివరించారు.

ఈఎంఐలు పోగా మహిళలకు నెలకు రూ.70 వేలు మిగులుతుందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మహిళలకు సాధికారత వచ్చిందని వెల్లడించారు. అన్ని బస్ స్టేషన్లలో రూ. 100 కోట్లతో మౌలిక వసతులు కల్పించామని తెలిపారు. ఏటారునాగారం, పెద్దపల్లి జిల్లాల్లో బస్ డిపోలు ఏర్పాటు చేశామన్నారు. ఆర్టీసీ కార్మికులు మరణిస్తే.. రూ. కోటి బీమా ఇచ్చేలా ఒప్పందం చేశామని తెలిపారు. పీఎఫ్ బకాయిలు రూ.1,355 ఉంటే.. రూ. 650 కోట్లకు తగ్గించామని స్పష్టం చేశారు.