4 August, 2026 | 5:00 AM

సచివాలయంలో 'మహిళ శక్తి' క్యాంటీన్లు ప్రారంభించిన మంత్రి సీతక్క

21-06-2024 06:03 PM

హైదరాబాద్ : సచివాలయంలో రెండు 'మహిళ శక్తి' క్యాంటీన్లు మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... మహిళ సంఘాలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు మహిళా శక్తి కార్యక్రమాన్ని  అమలు చేస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన భోజనం అందించాలని మహిళా సంఘాలకు సూచించారు. రెండేళ్లలో జిల్లాకి 5 చోప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటిన్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళా శక్తి క్యాంటిన్ లోనే సీతక్క సర్వపిండి కోనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సీఎస్ శాంతికుమారి, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.