18 April, 2026 | 2:43 PM

ముఖ్యమంత్రి కాళేశ్వరం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

18-04-2026 01:34 PM

రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి, మంత్రులు

మంథనిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): ఈ నెల 20వ తేదీన మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని మెడిగడ్డ ముఖ్యమంత్రి పర్యటను రైతులు, ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర  మంత్రులు కాటారం మండలంలోని నస్తూరి పల్లి లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారని శనివారం మంథనిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.

ముఖ్యమంత్రి బహిరంగ సభకు మంత్రి నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు రైతులను పెద్ద ఎత్తున తరలించాలని, గ్రామాలలోని సర్పంచులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బహిరంగ సభలో విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మంత్రి సూచించారు. అలాగే రామగుండం పెద్ద పెళ్లి ధర్మపురి నియోజకవర్గాలనుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ప్రజలు తరలి వస్తారని,  బహిరంగ సభలో ఇలాంటి అవంతిని గడ్డలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని, వేసవికాలం దృష్ట్యా నీటి కొడత లేకుండా చూస్తున్నామని, ప్రజలు అధికారులకు సహకరించాలని మంత్రి కోరారు. ఈ బహిరంగ సభ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు మొదలవుతుందని మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్,  వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్ రెడ్డి, కౌన్సిలర్లు,  జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి,  మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యులు శశిభూషణ్ కాచే,  కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సదానందం, ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, మాజీ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు,  మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐలి ప్రసాద్, దొడ్డ బాలాజీ, రోడ్డ బాబు, సయ్యద్ అన్వర్, మంథని, కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ లు కుడుదల వెంకన్న, వైనాల రాజు, కమాన్పూర్, ముత్తారం, మంథని యూత్ అధ్యక్షులు రెబల్ రాజకుమార్, బక్కతట్ల వినీత్ యాదవ్, సాధుల శ్రీకాంత్, సర్పంచులు ఉపసర్పంచులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.