18 April, 2026 | 3:07 PM

బాలింతలకు పోషకాహారం పంపిణీ

18-04-2026 01:28 PM

మల్లాపూర్, ఏప్రిల్, 18(విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఆవరణలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్స్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన గర్భిణీలు, బాలింతలకు బాలామృతం, కోడిగుడ్లు, పోషకాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ కనుమూల వెంకటేష్ మాట్లాడుతూ.. ఐసీడీఎస్ ద్వారా సరఫరా చేస్తున్న నిత్యావసర సరుకులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పిల్లలు, గర్భిణీ స్త్రీలు సమతుల్య ఆహారం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తోట గంగారెడ్డి, ఆరోగ్య కార్యకర్త కోమల, కార్యదర్శి సురేష్, అంగన్వాడీ టీచర్లు వై. సంధ్యారాణి, తోట జమున, పద్మ, నాయకులు బైన ప్రశాంత్, ఆశ కార్యకర్తలు రాణి, రమ, పిల్లలు, తల్లులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.