18 April, 2026 | 11:48 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మంథనిలో ఘనంగా మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు

30-05-2025 11:14 PM

మంథని(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మంథని ప్రధాన చౌరస్తాలో కేక్ కట్ చేసిన కాంగ్రెస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు అయిలి ప్రసాద్ మంత్రి శ్రీధర్ బాబు కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. యూత్ కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్ మరియు ఎరుకల ప్రవీణ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అందులో భాగంగా రక్తదానం చేసి, పండ్ల పంపిణీ  చేశారు. 

ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంథని రాకేష్, ఆధ్వర్యంలో మంథని మాత శిశు హాస్పిటల్ నందు కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు. బిసి సెల్ మండల అధ్యక్షుడు ఐలి శ్రీనివాస ఆధ్వర్యంలో దత్తాత్రేయ గుడిలో పూజలు చేశారు. పెద్దపెల్లి జిల్లా ఆర్టిఏ మెంబర్ మంథని సురేష్, లైసెట్టి రాజు, టి. రాజు, మంథని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాదుల శ్రీకాంత్, ఎన్ఎస్యుఐ డివిజన్ అధ్యక్షులు చెక్కల సందీప్ గౌడ్ ఆధ్వర్యంలో  శుక్రవారం  మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదానం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ  మంథని  ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు వారు కృషి చేస్తున్నారని, నిరంతరం ప్రజల కోసం ప్రజాసేవలో ఉండే ప్రజా నాయకుడు శ్రీధర్ బాబు అని,  ఆయన జన్మదిన వేడుకలను నిండు నూరేళ్లు జరుపుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు, మైనార్టీ సెల్ నాయకులు, మహిళ నాయకురాలు, కార్యకర్తలు, డి.ఎస్.బి అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.