7 July, 2026 | 2:29 AM

శబాష్ కౌన్సిలర్ దావల్గారి

07-07-2026 01:41 AM

కౌన్సిలర్‌ను అభినందించిన మంత్రి శ్రీధర్ బాబు

చేవెళ్ల జూలై ఆరు (విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపల్ లోని 8వ వార్డు కౌన్సిలర్ దావల్గారి గోపాల్ రెడ్డిని ఐటీ పరిశ్రమల శాఖ రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అభినందించారు. నియోజకవర్గంలో సోమవారం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు.

కార్యక్రమాల్లో భాగంగా పామెన గేట్ నుండి పామెన గ్రామం వరకు కౌన్సిలర్ దవల్ గారి తన సొంత నిధులు రూ.25 లక్షలతో బీటీ రోడ్డు పనులు మొదలుపెట్టారు. ఈ కార్యక్రమానికి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకుస్థాపన చేశారు.

అనంతరం మంత్రి శ్రీధర్ బాబు కౌన్సిలర్ దావల్గారి గోపాల్ రెడ్డిని శాలువాతో సన్మానించి భుజం తట్టి శభాష్ దావల్గారి గోపాల్ రెడ్డి అంటూ అభినందించారు. గ్రామ రోడ్డు గుంతల మయమావ్వగా ప్రజలు పడుతున్న ఇక్కట్లు చూసి తన సొంత నిధులతో బీటీ రోడ్డు వేయడం సంతోషించ దగ్గ విషయమన్నారు. స్వగ్రామానికి బీటీ వేసి మిగతా నాయకులకు ఆదర్శ ప్రాయంగా నిలిచారన్నారు. అనంతరం దావల్గారి మాట్లాడుతూ... తనను మున్సిపల్ కౌన్సిలర్ గా  గెలిపించిన ప్రజల కోసం వార్డు అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. ప్రజల బాధలు చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.