గడువులోగా మీరాలం చెరువు పనులు పూర్తి చేయాలి: సీఎం రేవంత్
మీరాలం చెరువు పర్యాటకులు రప్పించేలా ఏర్పాట్లు ఉండాలి
హైదరాబాద్: మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Musi Riverfront Development Corporation Ltd) ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న మీరాలం చెరువు ప్రతిష్టాత్మక వంతెన ప్రాజెక్ట్ సైట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) సందర్శించి, పురోగతిని సమీక్షించారు. ఈ తనిఖీలో సరస్సు చుట్టూ జరుగుతున్న పనులను గగనతలం నుండి వీక్షించేందుకు సీఎం రేవంత్ ఒక భారీ క్రేన్‌పైకి ఎక్కారు. చెరువును పరిశీలించిన అనంతరం అధికారులకు సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు. గడువులోగా మీరాలం చెరువు పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
చెరువులోకి(Meer Alam Cheruvu ) మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీరాలం నుంచి మూసీలోకి వరద వెళ్లేలా నాలాను విస్తరించాలని పేర్కొన్నారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్(Water sports) కోసం డిజైన్ ఏర్పాటు చేయాలన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీరాలం చెరువులో ఉన్న ఐ ల్యాండ్ లను అభివృద్ధి(Development of islands) చేయాలని వెల్లడించారు. మీరాలం చెరువుకు పర్యాటకులను రప్పించేలా ఏర్పాట్లు ఉండాలని వివరించారు. రూ. 430 కోట్ల ఈ ప్రాజెక్ట్‌ను 2027 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక వంతెన శాస్త్రిపురాన్ని చింతల్‌మెట్ రోడ్‌తో కలుపుతుంది. కాగా, ఈ విస్తృత ప్రాజెక్ట్‌లో అప్రోచ్‌లు, లైటింగ్, సుందరీకరణ, సరస్సు పునరుద్ధరణ పనులు కూడా ఉన్నాయి.






