మహనీయుల అడుగుజాడల్లో నడవాలి
07-07-2026 01:43 AM
బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి
శంకర్‌పల్లి, జూలై 6 (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు మహనీయుల అడుగుజాడల్లో నడుచుకోవాలని బిజెపి పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి అన్నారు. సోమవారం శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా పిల్లిగుండ్ల చౌరస్తా వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత దేశభక్తి, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనేందుకు ముందుకు రావాలని సూచించారు. చెడు మార్గాలకు దూరంగా ఉండి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీర్ల నర్సింలు , నాయకులు ప్రభాకర్ రెడ్డి, బయన్న, వెంకటేష్, వీరేందర్, సింహం రాజు తదితరులు పాల్గొన్నారు






