15 July, 2026 | 5:53 AM

యువతకు ఉపాధి కల్పిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

04-07-2024 12:33 PM

ఐటీ విస్తరించాలన్నదే మా సంకల్పం: శ్రీధర్ బాబు

రాక్స్ ఐటీ పార్కును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

హనుమకొండలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించారు. హనుమకొండలో రాక్స్ ఐటీ పార్క్ ను శ్రీధర్ బాబు గురువారం ప్రారంభించారు. ద్విదీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరించాలన్నదే తమ సంకల్పం అన్నారు. ఐటీ పరిశ్రమకు పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.విదేశాల్లోని తెలంగాణ వాసులు వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలన్నారు. ఎన్ఆర్ఐలకు ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని సూచించారు. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. పారిశ్రామికంగా హనుమకొండ, వరంగల్, అభివృద్ధి చెందుతాయన్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రైవేట్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని ఆయన వెల్లడించారు.