కేసీఆర్ స్పందించాలి
- సభకు వచ్చి మాట్లాడాలి
- స్పీకర్‌పై వాడిన భాషను బీఆర్‌ఎస్ ఎందుకు ఖండించడం లేదు
- ఆ పార్టీ డీఎన్‌ఏలోనే దళిత వ్యతిరేకత ఉంది
- స్పీకర్‌కు క్షమాపణ చెప్పిన తర్వాతనే మిగతా ఎజెండా అంశాలు
- మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): స్పీకర్‌పై ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu) అనుచిత వ్యాఖ్యలు చేయడం.. ఘోరమైన భాష ఉపయోగించడం దారుణమని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) మండిపడ్డారు. ‘ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటామని అంటున్నా.. కేటీఆర్, హరీశ్‌రావు తమ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఇప్పటి వరకు ఖండించలేదు. కనీసం స్పందించలేదు. బీఆర్‌ఎస్ ఎందుకు ఈ వ్యాఖ్యలపైన స్పందించదు. బీఆర్‌ఎస్ డీఎన్‌ఏలోనే దళిత వ్యతిరేకత ఉంది.
గతంలో దళిత డీప్యూటీ సీఎంరాజయ్యను కేసీఆర్ బర్తరఫ్ చేశారు. కడియం శ్రీహరిని సభలో అవమానించారు. బీఆర్‌ఎస్ దళిత వ్యతిరేక పార్టీగా నిరూపించుకుంటోంది. కేసీఆర్ సభకు రావా లి.. సంఘటన పైన స్పందించాలి. తమ సభ్యు ల ప్రవర్తన పైన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మా ట్లాడితే హుందాగా ఉంటుంది. స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు క్షమాపణ చెప్పాల్సిందే. కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు
అవిశ్వాస తీర్మానం పెడతామని కేటీఆర్, హరీశ్‌రావు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని, వీళ్ల బెదిరింపులకు కాంగ్రెస్ పార్టీ భయపడదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. స్పీకర్‌కు క్షమాపణ చెప్పిన తర్వాతే మిగిలిన ఎజెండా తీసుకోవాలని ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ, శా సనమండలి ప్రాంగణంలో బీఆర్‌ఎస్ నేతల ప్రవర్తన కారణంగా సిబ్బంది అడ్డుకున్నారని, పోలీసు సిబ్బంది కోరినా పట్టించుకోలేదన్నారు. పోలీసులపైన అసభ్య పదజాలంతో దూషిస్తు కాలర్ పట్టుకున్నారని ఆరోపించారు.
తాము డైవర్షన్ పాలిటిక్స్ చేయలేదని వెల్లడించారు. స్పీకర్ గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరి సభ్యులపైనా ఉంటుందన్నారు. ‘నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించి మమ్మల్ని క్షమాపణ అడుగుతారా, ఎన్ని రోజులైనా అసెంబ్లీ నడపడానికి మేం సిద్ధంగా ఉన్నామని స్పీకర్‌కు తెలిపాం. సభలో, సభ బయట గౌరవ సభ్యుల భాష పైన చర్చించాలని బీఎసీలో ప్రస్తావించాం’ అని పేర్కొన్నారు. కొందరు ఎమ్మెల్యేలుగా ఉండి పోలీసు లపైన దాడి చేశారని మంత్రి ఆరోపించారు. ఇప్పుడు కేటీఆర్‌తో పాటు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, నవీన్‌రెడ్డి పోలీసులపై దాడి చేసినట్లు వీడియోల్లో కనిపిస్తోందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్‌ఎస్ ప్రభుత్వమే బ్యాడ్జీలు, ప్లకార్డులు నిషేధం అని చెప్పారని, టీషర్టులపైన నినాదాలతో రావడం సభా సాంప్రదాయలకు విరుద్ధమని చెప్పారు. రాహుల్ గాంధీ పార్లమెంటుకు టీషర్టుపైన నినాదాలు లేని టీషర్టుతో పార్లమెంటుకు వెళ్లి నిరసన తెలిపారని గుర్తు చేశారు. టీషర్టులపైన నినాదాలతో వెళ్తే ప్లకార్డులుగా పరిగణిస్తారని, ఈ విషయం కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర సభ్యులకు తెలుసని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం నిరసనలు తెలపడానికి అన్ని అవకాశాలున్నాయని చెప్పారు.
మహిళా ఎమ్మెల్యేలకు ఇబ్బంది కలిగితే చర్యలు
మహిళా ఎమ్మెల్యేలకు ఇబ్బంది జరిగిందని తెలియగానే సీఎం రేవంత్‌రెడ్డి పోలీసు అధికారులతో సమీక్ష జరిపారని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. మహిళా శాసనస భ్యుల విషయంలో ఎక్కడైనా తప్పు జరిగితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పా రు. మహిళా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సభలోకి అనుమతి ఇచ్చాం.. వాళ్లను అడ్డు కోలేదన్నారు.
