ఈ ఏడాదిలో 65 జీసీసీలు తీసుకొచ్చాం: మంత్రి శ్రీధర్ బాబు
కొత్త జీసీసీ పాలసీ తీసుకురావడానికి కృషి చేస్తున్నాం
జీసీసీల రాకతో రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు
హైదరాబాద్: తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు(Telangana Monsoon Assembly Sessions) కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఐటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu) పేర్కొన్నారు. టైర్-2 సిటీల్లోని(Tier-2 city) ఐటీ టవర్లలో సంస్థల ఏర్పాటుకు ముందుకు రావటంలేదని సూచించారు. జిల్లాల్లోని ఐటీ టవర్ల(IT Tower) సమీపంలో మౌలిక వసతులపై ఆలోచిస్తున్నారని స్పష్టం చేశారు. ఈఏడాదిలో 65 జీసీసీలు తీసుకొచ్చామని తెలిపారు. 85 శాతం రెంటల్ స్పేసెస్(Rental Spaces) జీసీసీలతో నిండిపోయాయని శ్రీధర్ బాబు వెల్లడించారు.
జీసీసీల రాకతో రెండేళ్లలో లక్ష కొత్త ఉద్యోగాలు వస్తాయని సూచించారు. కొత్త జీసీసీ పాలసీ(GCC Policy) తీసుకురావడానికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ లో ఎయిర్ పోర్ట్(Adilabad Airport) ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వరంగల్ లో ఎయిర్ పోర్టు రాకతో ఉపాధి కల్పన పెరుగుతోందన్న శ్రీధర్ బాబు రాష్ట్రంలో సంస్థల ఏర్పాటుకు పరిశ్రమలు ముందుకొస్తాయన్నారు. ఒక్క డేటా సెంటర్ తో 7 వేల ఉపాధి లభించే అవకాశముందన్నారు. డేటా సెంటర్లను మనం వద్దంటే మరో ప్రాంతంలో ఏర్పాటు చేస్తారని తెలిపారు. అమెరికా, చైనా కూడా డేటా సెంటర్ల ఏర్పాటును ఆపట్లేదని వెల్లడించారు. సర్వర్ మ్యానుఫ్యాక్చర్ సంస్థలు(Server Manufacturing Companies) ఏర్పాటుకు ముందుకు వస్తున్నాయని చెప్పారు. ఐటీ సంస్థలు పెట్టుబడులు పెడితేనే ఉపాధి కల్పన పెరుగుతోందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.