calender_icon.png 5 February, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి మృతి తీరనిలోటు

05-02-2026 01:41:29 PM

  1. మంథని మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి మృతి నియోజక వర్గ ప్రజలకు తీరనిలోటు 
  2. ఆయనే ఎమ్మెల్యేగా  పేద ప్రజలకు ఎంతో సేవ చేశారు
  3. మంథనిలో రాంరెడ్డి భౌతిక దయానికి నివాళులర్పించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి మృతి నియోజక వర్గ ప్రజలకు, కుటుంబ సభ్యులకు తీరనిలోటని, ఆయనే ఎమ్మెల్యేగా  పేద ప్రజలకు ఎంతో సేవ చేశారని మంథనిలో రాంరెడ్డి భౌతిక దయానికి నివాళులర్పించిన అనంతరం మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. రాంరెడ్డి గత రెండు రోజుల క్రితం హైదరాబాదులో అనారోగ్యంతో మృతి చెందగా ఆయన పార్థివ దేహాన్ని బుధవారం రాత్రి మంథని లోని వారి స్వగృహానికి తీసుకువచ్చారు. అక్కడ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు రామిరెడ్డికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం మంథని నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా ముత్తారం మండలం ఖమ్మంపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు సూరాయపల్లి, కాకర్లపల్లి, ఇప్పలపల్లి మీదుగా సీతంపేట శివారులోని వ్యవసాయ క్షేత్రంలో భారీ ఎత్తున పాల్గొన్న అభిమానుల మధ్య రామిరెడ్డి భౌతిక దేహాన్ని తరలించి కుమారులు అంత్యక్రియలు పూర్తి చేశారు. మంథని నియోజక వర్గం నుంచే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రామిరెడ్డి తో  అనుబంధం ఉన్న అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రామ్ రెడ్డి తో ఉన్న అనుబంధాన్ని వారు నెమరు వేసుకున్నారు.