calender_icon.png 5 May, 2025 | 2:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

04-05-2025 08:31:48 PM

ధన్వాడలో దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలో మంత్రి శ్రీధర్ బాబు..

మంథని (విజయక్రాంతి): దత్తాత్రేయ స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(IT Minister Duddilla Sridhar Babu) అన్నారు. మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో శ్రీ దత్తాత్రేయ స్వామి వారి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం మంత్రి శ్రీధర్ బాబు గ్రామ ప్రజలతో కలిసి ఆలయంలో గణపతి పూజ 54 ప్రత్యేక కలశములు ఏర్పాటు చేసి దత్తాత్రేయ స్వామికి అభిషేకము, దత్త హోమంను ఘనంగా నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ... మంత్రి నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలోని, దేశంలోని ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని, అలాగే సకాలంలో వర్షాలు కురిసి రైతులకు అధిక దిగుబడులు రావాలని కోరుకున్నారు. వివిధ గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు మంథని, కాటారం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, కోట రాజబాబు, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దొడ్డ బాలాజీ, వైనాల రాజు, ప్రభాకర్ రెడ్డి, నాయకులు గుడాల శ్రీనివాస్, వనం రామచంద్రరావు, సిగ్గెం రాజేష్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.