calender_icon.png 5 May, 2025 | 1:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెయింట్ పాల్స్ స్కూల్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే వెంకట్రావు

04-05-2025 08:22:35 PM

భద్రాచలం (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఎస్ఎస్సీ-2025 ఫలితాలలో సెయింట్ పాల్స్ పాఠశాల 100% ఉత్తీర్ణతతో అగ్రగామిగా తన పూర్వవైభవాన్ని చాటి చెప్పడంతో నిరంతర కృషితో అత్యున్నత 550 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు స్థానిక శాసనసభ్యులు డా. తెల్లం వెంకట్రావు(MLA Dr. Tellam Venkat Rao) వారి క్యాంపు కార్యాలయంలో సన్మానించారు.

విద్యార్థులైన జశ్వంత్ రెడ్డి. 574/600, యశ్విక్ సాయి తేజ 575/600, స్వర్ణలత 559/600, రామ్ చరణ్ 554/-, అష్రఫ్-536 లను శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేసి, భవిష్యత్తులో.. ఉన్నత విద్యలో కూడా ఇదే విధంగా అభివృద్ధి సాధించాలని ఆశీర్వదిస్తూ గత 30 సం. పై చిలుకు ఏజెన్సీ ప్రాంతంలో అంగ్ల విద్యా బోధన ద్వారా విద్యనందిస్తున్న సెయింట్ పాల్స్ యాజమాన్యానికి పాఠశాల ప్రిన్సిపాల్ డా. అబ్రహం, ప్రధానోపాధ్యాయురాలు డా. రాధమంజరి, డైరెక్టర్ డా. అలీనశాంతి, రాజేష్ కు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.