గతంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసిందెవరు..?
హైదరాబాద్: జ్యోతీబా పూలే ప్రజాభవన్‌లో మంగళవారం 16వ కేంద్ర ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. అనంతరం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాన్ని నడపాలని ప్రజలు మాకు తీర్పు ఇచ్చారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఫలితాల తర్వాత కూడా ఏదో జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులు తిరిగారు. అంత తిరిగిన తర్వాత కూడా ప్రజలు మరోసారి తీర్పు ఇచ్చారని, లోక్ సభ ఎన్నికల్లో జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా కూడా బీఆర్ఎస్ నేతల వైఖరిలో మారలేదని శ్రీధర్ బాబు దుయ్యబట్టారు.
గతంలో ప్రజాస్వామ్య వ్యవస్థను ఖూనీ చేసిందెవరు..?, కాంగ్రెస్ శాసనసభ పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నది ఎవరు..? అని ప్రశ్నించారు. భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత హోదా లేకుండా చేసిందెవరు..? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలనే నమ్ముతుందని మంత్రి చెప్పారు. శాసనసభ నియమాల ప్రకారమే పీఏసీ ఛైర్మన్ ను స్వీకర్ నియమించారని, నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను.. అని పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ చెప్పారు. బీఆర్ఎస్ నేతలతో పీఏసీ ఛైర్మన్ కు అభిప్రాయభేదాలు ఉంటే మాకేం సంబంధం అని అరికెపూడి గాంధీ ఆగ్రహించారు. రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని పీఏసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ మండిపడ్డారు.






