బీసీ కుల గణనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
10-09-2024 04:42 PM
హైదరాబాద్: బీసీ గణన 3 నెలలోపు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కుల గణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది. బీసీ కుల గణన చేపట్టాలంటూ 2019లో పిటిషన్ దాఖలైంది. బీసీ సంఘం నేత ఎర్ర సత్య నారాయణ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. బీసీ కుల గణనపై సుప్రీం కోర్టు ఉత్తర్వులున్నాయని పిటిషనర్ పేర్కొనగా.. అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో తాజా ఉత్తర్వులు ఇచ్చి.. పిటిషన్ పై కోర్టు విచారణ ముగించింది.






