calender_icon.png 13 September, 2024 | 1:26 AM

తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాం

05-09-2024 11:44:29 AM

హైదరాబాద్: భవిష్యత్తు లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. తెలంగాణ ఏటా గణనీయమైన వృద్ధి రేటు సాధిస్తోందని మంత్రి వెల్లడించారు. తెలంగాణ 11.3 శాతం వృద్ధి రేటు నమోదు చేసిందని తెలిపారు. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం తెలంగాణ కలిగి ఉందన్నారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఏఐ సాంకేతికత దుర్వినియోగం కాకుండా చూడాల్సి ఉందన్నారు. హైదరాబాద్ నగరం గురువారం నుంచి రెండు రోజుల పాటు జరిగే ‘గ్లోబల్ ఏఐ సమ్మిట్’కు ఆతిథ్యం ఇవ్వనుంది. అగ్రశ్రేణి IT కార్పొరేట్ హెడ్‌లతో సహా 2,000 మందికి పైగా ప్రతినిధులు కూడా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం, ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావంపై చర్చలకు హాజరవుతారు.