కేరింతల కేలి… హోలీ సందడి
03-03-2026 01:19 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలో హోలీ(Holi celebrations) పండుగ పర్వదినం సందడి వాతావరణంలో జరిగింది. ముఖ్యంగా చిన్నారులు రంగురంగుల కలర్లు చల్లి కేరింతలు కొడుతూ హోలీ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కాలనీలు, వీధుల్లో ఉదయం నుంచే పిల్లల అల్లరి సందడి కనిపించింది. ఒకరిపై ఒకరు రంగులు పోసుకుంటూ, నీటి తుపాకులతో ఆడిపాడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో సురక్షితంగా వేడుకలు నిర్వహించారు. ఎటువంటి అపశృతి లేకుండా హోలీ పండుగను చిన్నారులు సంతోషంగా జరుపుకోవడం విశేషం.




