30 June, 2026 | 10:16 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ముత్తారంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు

16-03-2026 12:49 AM

ముత్తారం మారుతి 15 (విజయక్రాంతి): ముత్తారం మండలంలో ఇటీవల మరణించిన పలు బాధిత కుటుంబాలను ఆదివారం రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఎంపిటిసి మల్యాల రాజయ్య కుటుంబ సభ్యులతో పాటు, ముత్తారంకు చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు తూటి లక్ష్మణ్, కేతిరి లక్ష్మి ఇంటికి వెళ్లి మృతుల చిత్ర పటాలకు పూలమాలవేసి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అధికారులు అండగా ఉండాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, మాజీ జెడ్పిటిసి చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, మండలంలోని సర్పంచుల్ లు, ఉపసర్పంచ్ లు వార్డు సభ్యులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు తూటి రఫీ, నూనెటి కృష్ణ యాదవ్, డాక్టర్ శంకర్, డా.చారి, కోల విజయ్, గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు 

ముత్తారం మండలంలోని వివాహ వేడుకల్లో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కేసనపల్లి గ్రామంలో బక్కతట్ల కుమార్ యాదవ్ కుమారుడి వివాహ వేడుకల్లో,  ముత్తారంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సూదాటి సంపత్ రావు కుమారుని వేడుకల్లో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.