యాసంగి ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ సమీక్ష
09-06-2025 | 08:06pm
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నీటిపారుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్(Yasangi Season)లో తెలంగాణ అత్యధికంగా వరిని ఉత్పత్తి చేసిందని, దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి(Paddy Production) చేసే రాష్ట్రంగా తెలంగాణను కేంద్రం గుర్తించిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 8,378 కేంద్రాల నుంచి 72 లక్షల టన్నుల యాసంగి వరి ధాన్యం సేకరించి, 12.33 లక్షల మంది రైతులకు రూ.15.121 కోట్లు చెల్లించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది 13 లక్షల టన్నులు అధిక కొనుగోళ్లు, అదనంగా రూ.9,139 కోట్ల చెల్లింపులు చేసినట్లు ఆయన వెల్లడించారు.






