రైతులు ఆందోళన చెందొద్దు.. చివరి ధాన్యం గింజ వరకు కొంటాం: మంత్రి ఉత్తమ్
యాదాద్రి: ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government ) పారదర్శకంగా వ్యవహరిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్, శ్రీధర్ బాబు గురువారం పర్యటించారు. వంగపల్లిలో ధాన్యం కొనుగోళ్లను మంత్రులు పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లపై భువనగిరిలోఅధికారులతో సమీక్షించారు.
చివరి ధాన్యం గింజ వరకు కొంటామని ఉత్తమ్ కుమార్ హామీఇచ్చారు. తడిసిన ధాన్యం కూడా MSP ధరకే కొనుగులు చేస్తామని వెల్లడించారు. రూ.11 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామని ఉత్త కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఉచ్చులో తెలంగాణ రైతాంగం చిక్కొద్దని సూచించారు. కొనుగోళ్లలోనూ రికార్డ్ సృష్టిస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయిన తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కొనుగోళ్లు చేస్తుందని వివరించారు.






