రైతుల పక్షపాతి మంత్రి శ్రీధర్ బాబు
రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం
బిజెపి నేతల ఆరోపణ ఆవాస్తవం
డిసిసి అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్
మంథని, మే28: రాష్ట్రంలోని రైతులందరి సంక్షేమమే లక్ష్యంగా తమ కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని పెద్దపల్లి డిసిసి అధికార ప్రతినిధి సెగ్గెం రాజేష్ స్పష్టం చేశారు. రైతు భరోసా పర్యటన భాగంగా మంథనిలో పర్యటించిన బిజెపి నాయకులు తమ నేత మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పై కాంగ్రెస్ ప్రభుత్వం పై చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా తమ ఉనికిని చాటు కోవడం కోసం బిజెపి నాయకులు చేసిన ఆరోపాలు అవాస్తవమన్నారు.
మంథని నియోజకవర్గం తో పాటు రాష్ట్రంలోని రైతులందరికీ సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిరంతరం కృషి చేస్తున్నారన్నారని, వారి కోసం ఎరువులు, విత్తనాలు, సాగు నీరు అందుబాటులో ఉంచు ఉంచుతూ ఆదుకుంటున్నారన్నారు. పండించిన పంటలకు మద్దతు ధర చెల్లించడంతోపాటు అదనంగా మరో రూ. 500 బోనస్ చెల్లిస్తూ రైతులను ఆదుకుంటున్నారన్నారు.
ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కురిసే అకాల వర్షాలతో తడిసిన రంగు మారిన ధాన్యాన్ని సైతం తమ ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేసి ఆదుకుంటామని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఐటీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ప్రకటించిన విషయం బిజెపి నాయకులకు తెలియకపోవడం విచారకరమన్నారు. రైతులకు అందుబాటులో గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ ఏర్పాటు చేసి అన్ని సౌకర్యాలను కల్పించిందన్నారు. అక్కడక్కడ ఉన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూపడంత కదా అన్నారు. బిజెపి నాయకులు ఎన్నడు రైతుల పక్షాన నిలబడి మాట్లాడింది కానీ వారిని ఆదుకున్న తీరు చరిత్రలో లేదన్నారు. ఇప్పటికైనా రాజకీయానికి కోసం బిజెపి నేతలు తమ ప్రభుత్వాన్ని బదనాం చేయడం మానుకోవాలన్నారు.






