11 April, 2026 | 11:57 AM

Breaking News

మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •   కోదాడ జాతీయ రహదారిపై ఘోర బస్సుప్రమాదం... స్పాట్‌లో 36 మంది..!   •   బిక్కనూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం – ఇద్దరు మృతి   •   ఐలాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు   •   అమీన్‌పూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌... హైకోర్టు లాయర్‌ ఫామ్‌హౌస్‌ కూల్చివేత   •   జీవితంపై విరక్తి చెంది ఇద్దరు యువకుల ఇద్దరు ఆత్మహత్య   •   స్నేహితుల ఆపన్న హస్తం.. మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

ఓటు కోసం గలాట

11-02-2026 06:46 PM

9వ వార్డులో గందరగోళం 

కాంగ్రెస్ - బిజెపి మధ్య స్వల్ప వాగ్వివాదం 

షాద్‌నగర్,(విజయక్రాంతి): కౌంటర్ ఓటు వేసే విషయంలో మహిళకు ఒక పార్టీ వారు మద్దతు పలికితే మరో పార్టీ వారు వేయవద్దని అడ్డు చెప్పడంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టణంలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ బిజెపి నాయకులు ఒక్క ఓటు విషయంలో గలాటపడ్డారు. బీహార్ కు చెందిన ఓ మహిళ ఓటు వేయడానికి రాగా తన ఓటు వేరే వాళ్ళు వేశారని,  చాలెంజ్ ఓటు వేస్తామని చెప్పి  పోలింగ్ స్టేషన్ వద్దకు రావడంతో అసలు ఆమె దొంగ ఓట్లు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓటు వేయకుండా అడ్డుకున్నారు.

అప్పటికే సదరు మహిళ ఓట్లు వేసి వెళ్లిందని దాదాపు ఈ బూతులో బిజెపి నాయకులు 20 నుండి 30 ఓట్లు దొంగ ఓట్లు వేయించారని అక్కడ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి మాధవులు అదేవిధంగా బీజేపీ అభ్యర్థి ప్యాట అశోక్ కు సంబంధించిన ఇరువర్గాల పార్టీల నాయకులు ఓటు విషయంలో గలాటా పడడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఏసిపి లక్ష్మీనారాయణ సిఐ విజయ్ కుమార్  మోహరించిన ఇరువర్గాలను చెదరగొట్టారు. సదరు మహిళను ఎసిపి లక్ష్మీనారాయణ తీసుకెళ్లి విచారించారు. చివరకు ఆమె ఓటు వేయకుండానే వెనుతిరిగింది. అయితే ఈ ఒక్క ఓటు విషయంలో ఇరువర్గాలు బాహాబాహికి దిగడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.