ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం
నలుగురు అరెస్ట్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, ఏప్రి ల్ 7(విజయక్రాంతి): జిల్లాలో ప్రభుత్వ ధాన్యం దుర్వినియోగం చేసిన కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. సిర్పూర్‌టి మండలంలోని వెంకటరావుపేట గ్రామానికి చెందిన ఎం.ఎస్ శ్రీ సాయి బాలాజీ అగ్రో టెక్ రైస్ మిల్ యజమానులు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సిఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా దుర్వినియోగానికి పాల్పడడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రైస్ మిల్ యజమానులు రెనుకుంట్ల పద్మజ, బుద్ద మాధురి,రెనుకుంట్ల శివకుమార్, బుద్ద మనీష్‌లు తెలంగాణ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్తో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం ప్రకారం 2023 రబీ సీజన్కు సం బంధించిన ప్రభుత్వ వడ్లను మిల్లింగ్ చేసి బియ్యంగా ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. సుమారు 1825.744 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా దుర్వినియోగం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫైన్, వడ్డీ కలిపి సుమారు 2702.797 మెట్రిక్ టన్నుల వడ్లు లేదా రూ.6.91 కోట్ల విలువైన ధాన్యం ప్రభుత్వానికి అందజేయా ల్సి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే ధాన్యాన్ని భాగ్యలక్ష్మి రైస్ మిల్, సువర్ణ రైస్ మిల్ ద్వారా కోళ్ల దాణా, ఇతర అవసరాల కోసం విక్రయించి సుమారు రూ.3.8 కోట్లు పొందినట్లు, అందులో ఎక్కువ భాగాన్ని వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు పోలీసుల విచారణలో తేలింది. సివిల్ సప్లయ్స్ అధికా రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచినట్లు కౌటాల సర్కి ల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ తెలిపారు.




