డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సభకు ఏర్పాట్లు
చర్ల ,ఏప్రిల్ 7 (విజయక్రాంతి): చర్ల మండల కేంద్రంలో ఈనెల 14వ తేదీన జరిగే భారత రాజ్యాంగ నిర్మాత భీమ్ రావ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా చేయాలని దళిత సంఘాల ఐక్యవేదిక నిర్ణయించింది. ఈ నెల 14న జరిగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి (135వ జయంతి) వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మండలంలోని దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులతో పాటు మండల వ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దీనిలో భాగంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమన్వయకర్త కొంగూరు రమణారావు, కమిటీ గౌరవ అధ్యక్షులు దొడ్డ ప్రభుదాస్,కొంగూరు నరసింహారావు, అంబేద్కర్ నిర్మాణ కమిటీ అధ్యక్షులు తడికల లాలయ్య, కార్యదర్శి మచ్చ రామారావు తెలిపారు. ఈమెరకు మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిటీని ఏకాగ్రేవంక ఎన్నుకున్నట్లు తెలిపారు.
అంబేద్కర్ ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా తోటమల్ల రమణమూర్తి కార్యదర్శిగా బందెల చంటి ఉపాధ్యక్షులుగా ఎడెల్లి గణపతి, మచ్చ రాజా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కాళ్ళ కృష్ణ ముసలి సతీష్ కోశాధికారులుగా మచ్చ వీరభద్రం, మోత్కూరి ప్రభాకర్ రావు, కమిటీ సభ్యులుగా కనుకు భద్రం, నల్లగట్ల నరసింహమూర్తి, తోటమల్ల వరప్రసాద్, అలవాల కృష్ణ,తోటమల్ల విజయ రావు, చెన్నం రామ్మూర్తి, గుద్దేటి నాగరాజు, బిస్వాన్ గోపాల్, తడికల నరేష్, పాముల సాంబశివరావు, కారంపూడి సాల్మన్ రాజ్, రుంజా సుమన్, కొంగూరు సత్యనారాయణ, మేడాబత్తిని గోవర్ధన్, నిట్ట అబ్బులు, తడికల బుల్లబ్బాయి, నల్లగట్ల ప్రేమ్ సాగర్, రావులపల్లి చంటి, చింతల భాస్కర్లను ఎన్నుకున్నట్లు. 14 మంగళవారం జరగబోవు అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వారు తెలిపారు.




