జానంపేట 108 అంబులెన్స్‌లో తనిఖీ
08-04-2026 12:00 AM
పినపాక, ఏప్రిల్ 7, (విజయక్రాంతి): పినపాక మండలం, జానంపేట గ్రామానికి సేవలందిస్తున్న 108 అంబులెన్సు జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీసెస్ ఆడిట్ అధికారి కిషోర్ తనిఖీ చేశారు. పరికరాలు, మందుల లభ్యత, ఆక్సిజన్ నిల్వలను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండి గోల్డెన్ అవర్లో బాధితులను ఆసుపత్రులకు చేర్చాలని సూచించారు. ఈ తనిఖీలో భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్ , ఈఎంటి రమ్యక్రిష్ణ, పైలట్ తేజ పాల్గొన్నారు.




