మిఛెల్ స్టార్క్ వచ్చేస్తున్నాడు
ఆసీస్ క్రికెట్ బోర్డు అనుమతి
మెల్‌బోర్న్, ఏప్రిల్ 23: ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతోంది. ఇప్పటి వరకూ 3 విజయాలు, 3 పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లే ఆఫ్ రేస్ ఆసక్తికరంగా మారుతున్న వేళ ఢిల్లీ జట్టుకు గుడ్ న్యూస్ అందింది.
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ ఆడేందుకు ఆ దేశ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్టార్క్ మే 1 నుంచి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. గాయాలు, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లకు స్టార్క్ దూరమయ్యాడు. ఇప్పుడు అత ను గాయాల నుంచి పూర్తిగా కోలుకోవడంతో పాటు ఫిట్‌నెస్ సాధించడంతో అందుబాటులోకి వచ్చాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది.
స్టార్క్ పూర్తిగా కోలుకొని, ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను కూడా పూర్తి చేసుకున్నట్లు తెలిపింది. గతేడాది జరిగిన మినీ వేలంలో స్టార్క్‌ను దిల్లీ రూ.11.75 కోట్లకు కొనుగోలు చేసింది. కాగాఐపీఎల్‌లో ఈ సారి ప్రారంభ మ్యా చ్‌లకు విదేశీ ఆటగాళ్లు కొందరు దూరం కావడం వివాదాస్పదమైంది. అయితే తనకు గాయమైనట్లు స్టార్క్ ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. గత ఏడాది ఐపీఎల్లో ఢిల్లీ తరపున స్టార్క్ 11 మ్యాచ్‌లు ఆడి 14 వికెట్లు తీసుకున్నాడు.
కాగా స్టార్క్ రాకతో ఢిల్లీ బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది. ఆ జట్టు ఇప్పటికే ఎంగిడి, ముకే శ్ కుమార్, నటరాజన్ వంటి పేసర్లతో స్ట్రాం గ్‌గా ఉంది. స్పిన్ విభాగంలోనూ ఢిల్లీ చాలా పటిష్టంగా ఉంది. అక్షర్ పటేల్, కుల్దీప్ యా దవ్ వంటి అత్యుత్తమ స్పిన్నర్లు ఈ జట్టులోనే ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన మ్యా చ్‌లలో ఢిల్లీకి బౌలింగ్ విభాగంలో ఎలాం టి ఇబ్బందులు ఎదురుకాలేదు. బౌలర్లు సమిష్టిగా రాణిస్తూ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. బ్యాటింగ్‌లోనే ఢిల్లీ కాస్త తడబడుతోంది.






