కాల భైరవ స్వామికి ఎమ్మెల్యే బండారి ప్రత్యేక పూజలు
11-09-2026 | 03:02pm
ఉప్పల్ సెప్టెంబర్ 11(విజయక్రాంతి): అమావాస్య సందర్భంగా ఉప్పల్ బాగాయత్లోని కాల భైరవ స్వామి దేవాలయంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshma Reddy) ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాల భైరవ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు శాంతి, సౌభాగ్యాలు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.