నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లు విడుదల చేసిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
15-06-2026 12:24 PM
పోస్టర్లు విడుదల చేస్తున్న ఎమ్మెల్యేబొజ్జు పటేల్
ఉట్నూర్,జూన్15(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం నేషనల్ టాలెంట్ హంట్ పోస్టర్లను(National Talent Hunt posters) నాయకులతో కలిసి ఖానాపూర్ ఎమ్మెల్యే,నిర్మల్ డిసిసి అధ్యక్షులు వెడ్మ బోజ్జు పటేల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel ) మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేపట్టే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ శ్రీధర్, కాంగ్రెస్ నాయకుడు అరికిల్ల అశోక్, నాయకులు పాల్గొన్నారు.






