24 July, 2026 | 4:25 PM

నితిన్ గడ్కరిని కలిసిన ఎమ్మెల్యే పాల్వాయి

24-07-2026 03:55 PM

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరిని శుక్రవారం న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్–నాగపూర్ గ్రీన్‌ఫీల్డ్ ఆక్సిస్ కంట్రోల్డ్ జాతీయ రహదారి నిర్మాణంతో పాటు, పెండింగ్‌లో ఉన్న బెల్లంపల్లి–గడ్చిరోలి జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని కోరారు. గడ్చిరోలిలో ఐరన్ ఓర్ రవాణాకు ఈ రహదారి ఎంతో కీలకమని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందిస్తూ అధికారులతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.