రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం
- బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
కొల్లాపూర్ రూరల్: కొల్లాపూర్ ఎన్టీఆర్ చౌరస్తాలో శుక్రవారం బీజేపీ నాయకులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దిష్టిబొమ్మను ఆర్పేందుకు పోలీసులు ప్రయత్నించడంతో బీజేపీ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. బీజేపీ నాయకులు మాట్లాడుతూ... కాంగ్రెస్ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేసినప్పుడు అడ్డుకోని పోలీసులు, రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధాన్ని మాత్రం అడ్డుకోవడం సరికాదన్నారు. ప్రధానమంత్రి నివాసం ముందు నిరసనలు చేయడం సమంజసం కాదని, విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధితో పోరాడాలని రాహుల్ గాంధీకి సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు సాయి కృష్ణ గౌడ్, శ్రీధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు కేత్తూరి నారాయణతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.






