24 July, 2026 | 4:35 PM

ఎన్‌టీఏ రద్దు చేయాలి.. కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించాలి

24-07-2026 03:57 PM

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): ఎన్‌టీఏను వెంటనే రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించాలని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు.తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుతో శుక్రవారం జిల్లాలో పాఠశాలలు, కళాశాలల బంద్ నిర్వహించగా మంచి స్పందన లభించింది. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంబేద్కర్ కూడలిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ఎన్‌టీఏను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.