24 July, 2026 | 4:56 PM

ఎస్‌ఐఆర్‌ను సీరియస్‌గా తీసుకోవాలి: మంత్రి జూపల్లి

24-07-2026 04:22 PM

కొల్లాపూర్ రూరల్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision) ప్రక్రియను ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకుని గడువులోగా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించి తమ ఓటు హక్కును కాపాడుకోవాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) పిలుపునిచ్చారు. కొల్లాపూర్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించిన మంత్రి, బీఎల్ఏలు, బీఎల్వోలు సమన్వయంతో పనిచేసి అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడాలని ఆదేశించారు. అందుబాటులో లేని ఓటర్లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలు సేకరించి ఫారాలు పూర్తి చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.