శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి

15-09-2026 | 06:23pm

బోథ్,(విజయకాంత్రి): శాంతియుత వాతావరణంలో గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని జరుపుకోవాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ గణేష్ మండలి(Friends Youth Ganesh Council) ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని(Annadana program) ప్రారంభించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక యూత్ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించగా అన్నదాత కిషోర్ వార్డు సభ్యులు ప్రవీణ్ . విగ్రదాత లింగారెడ్డి నను అభినందించారు. కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు