శేషగిరి రావును పరామర్శించిన ఎమ్మెల్యే జారే
24-08-2026 08:18 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లికి చెందిన సీనియర్ జర్నలిస్టు అయితా శేషగిరిరావు అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకుని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సోమవారం ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా శేషగిరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జహీరుద్దీన్, నాయకులు పేటేటి నరసింహారావు, తాండ్ర ప్రభాకర్ రావు, జగన్నాధపురం సర్పంచి కుంజా వినోద్, మాజీ సర్పంచులు కారం సుధీర్, భూక్యపత్తిలాల్, గాడి తిరుపతి రెడ్డి, సురభి రాజేష్, ఈర్ల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.






