సీఎంని కలిసిన ఎమ్మెల్యే కాంతారావు
04-03-2026 12:34 AM
నిజాంసాగర్, మార్చి 3 (విజయక్రాంతి): జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న జుక్కల్ శాసనసభ్యులు తోట లక్ష్మీకాంతరావు మంగళవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి హోలీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. జుక్కల్ నియోజకవర్గం లోని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని ఆయన కోరడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.




