ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
16-06-2026 07:15 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల పరిధిలోని జైత్రం తండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సుభాష్ నాయక్ అధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి మంగళవారం విశేష స్పందన లభించింది. చేగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆస్పత్రి వైద్య సిబ్బంది వైద్య శిబిరానికి హజరైన గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణి చేశారు. ఆరోగ్యమే ఆసలైన సంపదనే స్పృహతో, ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్టు సి హెచ్ ఓ అనిషోద్దిన అభిప్రాయం వ్యక్తం చేశారు.






