20 August, 2026 | 2:24 PM

అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి

20-08-2026 01:01 PM

అధికారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదేశం

నియోజకవర్గం లోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం 

​ఆమనగల్లు, అగస్టు 20(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే  కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy)  హైదరాబాద్‌లోని తన నివాసంలో హౌసింగ్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ట్రైబల్ పంచాయతీరాజ్ అధికారులతో విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.​ఈ సమావేశంలో ఎంపీడీవోలు  జయరాం, గీత, సీత,  శంకర్ నాయక్, విజయలక్ష్మి, సులోచన, సుజాత, మున్సిపల్ కమిషనర్లు రాఘవేందర్,  షేక్ మొహమ్మద్, పంచాయతీరాజ్ శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీ బసవలింగం, పంచాయతీరాజ్ ఏఈలు, హౌసింగ్ ఏఈలు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

​సమావేశంలో ప్రధానంగా నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధి పనులు ​ మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రెండో విడత మంజూరు చేయాల్సిన ఇళ్లకు సంబంధించి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ ఫలాలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్ల నిర్మాణాలు, కొత్త బీటీ రోడ్ల ప్రతిపాదనలు, నిర్మాణం పూర్తికావచ్చిన పనులపై సమీక్షించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్న రహదారులకు తొలి ప్రాధాన్యం ఇచ్చి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

​నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి పనులను ఆయా శాఖల అధికారులు రోల్ కీలకమని ఆయన ఆయన పేర్కొన్నారు.