4 July, 2026 | 3:15 AM

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికిన ఎమ్మెల్యే కసిరెడ్డి

04-07-2026 02:16 AM

కడ్తాల్, జులై 3(విజయక్రా ంతి): రాష్ట్ర నీటి పారుదల, పౌ రసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉ త్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం కల్వకుర్తి నియోజకవర్గంలో పర్య టించారు. ఉదయం 11:00 గం టలకు ముచ్చర్ల ఫ్యూచర్ సిటీ పరిధిలోని హెలిప్యాడ్కు చేరుకున్న మంత్రికి.. కల్వకుర్తి ని యోజకవర్గ శాసనసభ్యులు  కసిరెడ్డి నారాయణరెడ్డి, పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. మం త్రికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి సాదరంగా ఆహ్వానించారు.

 అభివృద్ధి పనులపై సంక్షిప్త చర్చ:

హెలిప్యాడ్ వద్ద మంత్రికి స్వాగతం పలికిన అనంతరం, నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులు, ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంక్షిప్తంగా చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, పలువురు అధికారులు కూడా మంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

హెలిప్యాడ్ నుండి నేరుగా కడ్తాల పట్టణానికి చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి గారు.. స్థానిక ఎస్‌ఎల్‌ఆర్ (SLR) గార్డెన్స్లో నిర్వహించిన ఒక వివాహ వేడుకకు హాజరయ్యారు. కల్యాణ వేదికపై నూతన వధూవరులను ఆశీర్వదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహానికి విచ్చేసిన పెళ్లి పెద్దలు, బంధుమిత్రులు మరియు స్థానిక నేతలతో మంత్రి, ఎమ్మెల్యే కాసేపు ముచ్చటించారు.కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.