16 April, 2026 | 9:43 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి

01-02-2026 12:44 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): రెబ్బన మండలం గంగాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే  కోవ లక్ష్మి ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఎమ్మెల్యేను అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రెబ్బన మండల అధ్యక్షులు పోటు శ్రీధర్ రెడ్డి, సర్పంచులు దుర్గం భరద్వాజ్, అజ్మీరా బాపూరావు, మాదాసు రవీందర్, ఉపసర్పంచ్ వరలక్ష్మి దుర్గారావు, పుప్పాల శంకరయ్య, మధునయ్య, సంఘం శ్రీను, బోర్కుటే తిరుపతి, సత్యనారాయణ, వినోద్ జైస్వాల్, ఆనంద్, మన్యం పద్మ, విశాల్ తదితరులు పాల్గొన్నారు.