16 April, 2026 | 11:29 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

పౌర హక్కులపై అవగాహన సదస్సు

01-02-2026 12:47 PM

శ్రీరంగాపురం: పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండల పరిధిలోని శేరుపల్లి గ్రామంలో తాహశీల్దార్ రాజు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాహశీల్దార్ రాజు సమాజంలో ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ ఉండాలన్న మౌలిక సూత్రాన్ని గుర్తు చేసే రోజు పౌర హక్కుల దినోత్సవం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌర హక్కులు అనేవి కేవలం చట్టపరమైన అంశాలు మాత్రమే కాదు,

అవి మానవ గౌరవాన్ని కాపాడే పునాదులు. వ్యక్తి స్వేచ్ఛ, మాటల హక్కు, జీవన హక్కు, సమానత్వం, న్యాయం పొందే హక్కు వంటి అంశాలు పౌర హక్కులలో ప్రధానమైనవి. ఇవి లేకపోతే ప్రజాస్వామ్యం అర్థం కోల్పోతుంది. అందుకే రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని తాహశీల్దార్ రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో నారాయణ, ఎస్ఐ హిమబిందు, గ్రామ సర్పంచ్ వెంకటయ్య, పంచాయతీ కార్యదర్శి కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.