16 April, 2026 | 8:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ దగ్ధం

01-02-2026 12:42 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆదివారం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో  మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ శాఖ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గ్రామాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకు వస్తుందా? అని ప్రశ్నించారు. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఫోన్ టాపింగ్ కేసు పేరుతో సీట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులీచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్పై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. 

ఈ కార్యక్రమాల్లో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.  బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు చింతకుంట్ల మనోజ్, తప్పట్ల ఎల్లయ్య, మాతంగి వెంకటమ్మ కరుణాకర్, మేడుదుల రమేష్,జిల్లా నాయకులు గుండగానీ రాములు గౌడ్,  దొంగరి శ్రీను, మల్యాల రాములు,గౌడ్ చర్ల సత్యనారాయణ, మహిళా మండల కమిటీ అధ్యక్షురాలు తునికి లక్ష్మమ్మ, మల్లెపాక రాములు, గుడిపాటి వీరయ్య, గడ్డం సోమేశ్, కడారి దాసు, మట్టిపల్లి వెంకట్, గునిగంటి యాదగిరి, గోపగాని రమేష్,శ్రీను, తడకమళ్ళ రవి,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.